గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్ధార్..రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్ధార్..రేవంత్ రెడ్డి

October 21, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడిని భగ్నం చేయడం కోసం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పలువురు కాంగ్రెస్ లీడర్లను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. 

మరికొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆయనను కూడా హౌజ్ అరెస్ట్ చేసారని తెలుస్తోంది. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా రేవంత్ స్పందించారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. అంజన్ యాదవ్, రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.