Telangana congress leader Revanth Reddy on cordial relation with jaggareddy
mictv telugu

జగ్గారెడ్డి నా తోడికోడలు, మేమంతే.. రేవంత్ రెడ్డి

December 2, 2022

అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో కీచులాటలు మామూలేనని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. పార్టీని, తనను నిత్యం సతాయిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన తోడికోడలు అని పంచ్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో వీరిద్దరూ తోడి4కోడళ్ల పంచాయితీలా మీడియాతో మాట్లాడారు. మీడియానే తమ మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తోందని వాపోయారు.

‘‘తోడికోడళ్లు ఒకింట్లో ఉన్నప్పుడు ఎన్నో అనుకుంటారు, ఆ తర్వాత కలసిపోతారు. మేం కూడా అంతే. మీరే మా మధ్య దూరం పెంచుతున్నారు’’ ఛలోక్తి విసిరారు. తర్వాత ఇద్దరూ కలసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. రేవంత్ రెడ్డితో గొడవలపై జగ్గారెడ్డి స్పందిస్తూ, ‘‘మేం మేం ఎన్నో అనుకుంటాం. కలసిపోతాం. రేవంత్ రెడ్డి గురించి నేను చెప్పాల్సింది చెప్పేశాను. ముందొక మాటా, వెనకొక మాటా మాట్లాడే అలవాటు నాకు లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని ఏమీ అనను’’ అని చెప్పారు.