అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టకపోతే చచ్చిపోతా.. వీహెచ్ - MicTv.in - Telugu News
mictv telugu

అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టకపోతే చచ్చిపోతా.. వీహెచ్

April 16, 2019

హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్టలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం, తర్వాత అది ముక్కలు కావడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహాన్ని మళ్లీ అక్కడే ఏర్పాటు చేయాలని పలు పార్టీలు, హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘట దురదృష్టకరమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా నిరసనలు ఆగడం లేదు.

Telangana congress leader VH hanumantarao warns he will kill himself if amedkar statue not reinstated at punjagutta in Hyderabad removed by GHMC officials

వారంలోగా అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి పంజగుట్లలో పెట్టకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హెచ్చరించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ‘మా వాళ్లు స్టేట్‌మెంట్లు మాత్రమే ఇస్తారు.. పనులు చేయరు. విగ్రహం కూల్చితే అన్ని పార్టీల నేతలూ వచ్చారు. కానీ మావాళ్లు మాత్రం రాలేదు. అంబేడ్కర్‌పై బీసీలకు ఉన్నంత ప్రేమ మా పార్టీలోని దళిత నాయకులకు కూడా లేదు. గాంధీభవన్‌లో గాంధీ బొమ్మ పక్కనే నా డబ్బులతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తాను.. పంజాగుట్టలలో అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి పెట్టకపోతే నేను చచ్చిపోతా.. ’ అని అన్నారు. విగ్రహాన్ని కూల్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.  విగ్రహానికి అనుమతి లేదన్న వాదనపై స్పందిస్తూ.. ‘ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఉన్నాయి?’ అని ఎదురు ప్రశ్నించారు.