Home > Featured > ఓయూ భూములను కాపాడండి..తమిళిసైకి కాంగ్రెస్ మొర

ఓయూ భూములను కాపాడండి..తమిళిసైకి కాంగ్రెస్ మొర

ou

తెలంగాణ కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, బట్టి విక్రమాంర్క, రాములు నాయక్ ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తో భేటీ తరువాత కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ..'ఓయూ భూములను కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో సర్వే చేయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఓయూ భూములు కబ్జా జరుగుతుంది.' అని అన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీల భూములను నిర్వీర్యం చేస్తోంది. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా వాటిని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుంటే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ యూనివర్సిటీలను రక్షించాలని గవర్నర్‌ను కోరాం.' అని మరో కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. మరో కాంగ్రెస్ నేత రాములు నాయక్ మాట్లాడుతూ..'సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్లపై‌ మోసం చేస్తున్నారు. జీవోనెం.3పై ఇప్పటివరకు ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేయలేదు. ఈ విషయాన్ని గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్ళాను. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయినా గిరిజనుల రిజర్వేషన్లు పెంచలేదు. గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో గవర్నర్‌ కలుగజేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కాలరాసేలా కుట్ర జరుగుతోంది.' అని అన్నారు.

Updated : 1 Jun 2020 4:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top