భారత్‌ జోడో యాత్రలో అపశృతి.. కీలక నేతలకు గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ జోడో యాత్రలో అపశృతి.. కీలక నేతలకు గాయాలు

October 24, 2022

Telangana Congress leaders were injured in Rahul Bharat Jodo Yatra

 

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఆదివారం(నిన్న) నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించిన జోడో యాత్రలో కార్యకర్తల తోపులాటలో పలువురు ముఖ్య నేతలు కిందపడి గాయపడ్డారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, మహేష్‌కుమార్ గౌడ్‌ లకు గాయాలయ్యాయి. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తోపులాటలో కింద పడిపోగా చేతికి దెబ్బ తగిలింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హాజరైనప్పటికీ పాదయాత్ర సందర్భంగా రాహుల్‌తో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ కూడా దక్కలేదు. ఇక రక్తంతో ఇబ్బందులు పడిన పొన్నాలకు.. మాజీ మంత్రి గీతారెడ్డి కట్టుకట్టారు. ఆయన్ను ఏఐజీ హాస్పిటల్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

Telangana Congress leaders were injured in Rahul Bharat Jodo Yatra

కాగా దీపావళి పండగ, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారోత్సం సందర్భంగా మూడు రోజులు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ. ఈ నెల 24,25,26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇస్తారు. అనంతరం తిరిగి అక్టోబర్ 27న ఉదయం గూడెంబెల్లూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇక తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర గాంధీ పాదయాత్ర చేయనున్నారు. నవంబర్ 4న ఒకరోజు సాధారణ విరామం ఉండనుంది.