నితిన్ గడ్కరీతో కాంగ్రెస్ ఎంపీల భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ గడ్కరీతో కాంగ్రెస్ ఎంపీల భేటీ

November 26, 2019

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు పడుతోన్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు లేఖను ప్రధాని కార్యాలయ కార్యదర్శికి అందించారు. 50 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. ఆర్టీసి కార్మికుల బాధల పట్ల తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. త్వరలోనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. 

ఇక సమ్మె విషయానికి వస్తే..నిన్న సమ్మెను విరమించి రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక నాయకులు చేసిన ప్రకటనపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. సమ్మె చేయడం, మానడం అంతా మీ ఇష్టమేనా అని మండిపడింది. ఇప్పుడే వారిని చేర్చుకోబోమని, కార్మిక కోర్టు నిర్ణయం వరకు వేచి చూస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఓ ప్రకటన జారీ చేశారు.