రెండు మూడు రోజుల్లో రాజీనామా చేస్తా.. జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రెండు మూడు రోజుల్లో రాజీనామా చేస్తా.. జగ్గారెడ్డి

February 19, 2022

02

తెలంగాణ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. పార్టీని వీడిపోతానన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నాయకులు బుజ్జగిస్తారు. అయితే తాను పార్టీని వీడడం ఖాయమని జగ్గారెడ్డి శనివారం కూడా తేల్చి చెప్పారు. ‘రెండు మూడు రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తా. తర్వాత ఏ పార్టీలోనూ చేరను. నేను పోవడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమీ లేదు. నా వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారితో కలసి పార్టీలో ఉండలేను’ అని ఆయన మీడియాతో అన్నారు.

‘పార్టీ కోసం ఎంతో కష్టపడిన నన్ను అవమానించారు. నాపై కుట్రలు చేశారు. ఇక భరించలేను’ అని పేర్కొన్నారు. అన్ని విషయాలూ వివరిస్తూ అధిష్టానికి తెలుపుతానని, రాజీనామా లేఖ రెండు మూడు రోజుల్లో ఇస్తానని చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి కట్టబెట్టడాన్ని జగ్గారెడ్డి తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఆ పదవికి తాను కూడా అర్హుణ్నని ఆయన అంటున్నారు. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడం, మంత్రులను కలసి వినతిపత్రాలు సమర్పిస్తుడడడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.