కాంగ్రెస్ పార్టీలోకి రారండోయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ పార్టీలోకి రారండోయ్..

October 28, 2017

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, ఇర ఇతర పార్టీల నుండి  తమ పార్టీలోకి చాలా మంది నేతలు రానున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. శనివారం ఆయన హుజూర్ నగర్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.‘టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలోలా కాకుండా 4 విడతలుగా రుణ మాఫీ చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది .దీంతో 35 లక్షల, 30 వేల మంది రైతుల పాసు పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి.  శాసన సభలో ముఖ్యమంత్రి స్వయంగా వడ్డీ భారం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు విడుదల చేయలేదు.. అదేవిధంగా మూడున్నర ఏళ్లపాటు తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు కూడా సరియైన కొనుగోలు జరగలేదు.

వేలాది మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం 4,300 మద్దతు ధరకు చర్యలు లేవు. కాంగ్రెస్ పార్టీ 2019లో  అధికారం లోకి రాగానే ఏకకాలంలో రైతులకు 2లక్షల  రుణ మాఫీ చేస్తుంది.  వరికి 2వేలు,పత్తికి 5వేలు మద్దతు ధర కల్పిస్తాం. అవసరమైన చోట పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని ఉత్తమ్ చెప్పారు.  అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి, హుజూర్ నగర్, చింతలపాలెం,మేళ్లచెర్వు, పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ధరఖాస్తులను పరిశీలించారు. ఈ పధకాల ద్వారా మంజూరైన చెక్కు లను లబ్దిదారులకు అందజేశారు.