తెలంగాణలో డాక్టర్ దంపతులకు కరోనా.. మొత్తం 44 - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో డాక్టర్ దంపతులకు కరోనా.. మొత్తం 44

March 26, 2020

Telangana corona cases .

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారి నుంచి మిగతా వారికి సోకుంతోంది. ముఖ్యంగా ఇటలీ, మలేసియా, ఇండోనేషియా, గల్ఫ్ దేశాలకు వచ్చిన వారి ద్వారా వ్యాధి విస్తరిస్తోంది. గత మూడు నెలల్లో ఎవరెవరు కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చారో కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. కరోనా వచ్చినవారితోపాటు ఆ వైరస్ లక్షణాలను గుర్తించే యంత్రంగం సరిగ్గా లేకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా రాష్ర్టంలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ దోమల్‌గూడకు చెందిన డాక్టర్ దంపతులకు పాటిజివ్ వచ్చింది. భర్త వయసు 41, భార్య వయసు 36 అని, వీరితోపాటు వీరి కుటుంబసభ్యులను ఐసొలేషన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. కరోనా రోగుల ద్వారా వీరికి ఆ వ్యాధి సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కుత్బుల్లాపూర్ నివాసి(49)కు కోరోనా సోకింది. అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారని, ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.