తెలంగాణలో కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

September 18, 2020

caronaa

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో 1802  మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 11 మంది మృతి చెందారు. 50,634 శాంపిల్స్‌ పరీక్షించగా ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. రికవరీ రేటు 81.02శాతానికి చేరుకుంది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,67,046 మంది వ్యాధిబారినపడ్డారు. 1,35,357 మంది కోలుకోగా.. 1,016 మంది మృత్యువాతపడ్డారు. ఇంకా 30,673 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 24,081 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం  23,79,950 టెస్టులు నిర్వహించారు. నిన్నటి పరీక్షల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ 314,రంగారెడ్డి 174, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 144, నల్గొండ 131, సిద్దిపేటలో 121, కరీంనగర్‌ 114 మందికి వ్యాధి సోకింది.