కేసీఆర్ దిగిరాకపోతే మద్దుతుపై పునరాలోచన.. సీపీఐ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ దిగిరాకపోతే మద్దుతుపై పునరాలోచన.. సీపీఐ హెచ్చరిక

October 9, 2019

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకుని కార్మికుల ప్రయోజనాల కోసం పాటుపడాలని సీపీఐ స్పష్టం చేసింది. ఆయన దిగిరాకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఇస్తున్న మద్దతుపై పునరాలోచిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఈ రోజు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఆ పని కేసీఆర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.  

huzur nagar..

‘మేం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటాం. కార్మికు సమ్మె ఉధృతం కాకముందు మేం టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. తర్వాత సమ్మె చేశారు. మారిన పరిస్థితులకు తగ్గట్టు మేం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మా పార్టీ కమిటీ మళ్ల సమావేశమై మద్దతు విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. సీఎం పట్టుదలకు పోకుండా సమస్యను పరిష్కరించాలి. ఇది ప్రజాస్వామ్యం,  దొరల రాజ్యం కాదు..’ అని అన్నారు. ఉద్యోగులను తొలగించామని కేసీఆర్ చెప్పడం సరికాదని, మొండివైఖరితో ఆయనే సెల్ప్ డిస్మిస్ చేసుకుంటున్నాడని విమర్శించారు. మొన్నటి వరకు సమ్మె వేరు, టీఆర్ఎస్ కు మద్దతు వేరు అని చెప్పిన చాడ సమ్మె తీవ్రరూపం దాల్చడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.