Telangana Dasara Holidays 2022: 15 Days For Schools and Colleges
mictv telugu

గుడ్ న్యూస్.. తెలంగాణలో 15 రోజులు దసరా సెలవులు.. ఏపీలో..

September 13, 2022

తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల 26 నుంచి దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు దసరా సెలవులు ఇచ్చారు. అలాగే.. ఈనెల 25న ఆదివారం, అక్టోబర్‌ 9వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం 15 రోజులు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్‌ 10న స్కూళ్లు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. దసరా పండుగ అక్టోబర్‌ 5న జరుగనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో సెలవులను పెంచిన విషయం తెలిసిందే.

ఏపీలో కూడా దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6 వరకు ప్రకటించారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. ఏపీలో ఏటా జూన్ లో మొదలయ్యే క్లాస్ లు ఈ ఏడాది జూలైలో ప్రారంభం అయ్యాయి. ఇలా 20 రోజులు వెనక్కి వెళ్లింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ముగుస్తాయి.