Telangana declares Diwali holiday on October 24, Monday
mictv telugu

దీపావళి పండుగ సెలవుల్లో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

October 20, 2022

దీపావళి పండుగ సెలవు విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు అక్టోబర్ 25న దీపావళి సెలవును ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అక్టోబర్ 24న సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు మంగళవారానికి బదులు సోమవారం సెలవులు ఇవ్వనున్నాయి.

ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న దీపావళి వస్తుంది. కానీ ఆ రోజు సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి కాబట్టి పండుగ జరుపుకోవడం కరెక్ట్ కాదని పండితులు అభిప్రాయపడుతున్నారు. 24న రాతంత్రా అమావాస్య ఘడియలు ఉంటాయి. కాబట్టి ఆ రోజే పండుగ జరుపుకోవడం సరైనదని పండితులు చెబుతున్నారు. 24న ఉదయం చతుర్దశి ఉండనుండగా.. రాతంత్రా అమావాస్య కొనసాగుతుందని చెబుతున్నారు. అదే రోజన లక్ష్మీ దేవికి పూజ చేసి.. రాత్రి దీపాలను వెలిగించాలని సూచిస్తున్నారు.