Telangana: Details of 529 senior and junior posts released
mictv telugu

తెలంగాణ: 529 సీనియర్, జూనియర్ పోస్టుల వివరాలు విడుదల

September 10, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లోని పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఆర్థికశాఖ ఇటీవలే 529 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, మంజూరు చేసిన ఆ 529 పోస్టుల విషయంలో ఏఏ జిల్లాలకు ఎన్నెన్ని పోస్టులను కేటాయించారు. ఆ పోస్టులు ఏవి? అనే వివరాలను శుక్రవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు వెల్లడించారు.

”జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ, ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో జెడ్పీ సూపరిటెండెంట్ పోస్టులు108, జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 151, జెడ్పీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 213 ఉన్నాయి. వీటితోపాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 22, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 40 మంజూరు అయ్యాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మరికొన్నింటిని పదోన్న తుల ద్వారా భర్తీ చేస్తారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 34, సంగారెడ్డి, నిర్మల్, నాగర్‌కర్నూల్, మెదక్ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి” అని ఆయన తెలియజేశారు.

ఆయా జిల్లాలకు కేటాయించిన పోస్టుల వివరాలు ఇవే..