డిస్కౌంట్ ఎఫెక్ట్.. చలానా సర్వర్ డౌన్ - MicTv.in - Telugu News
mictv telugu

డిస్కౌంట్ ఎఫెక్ట్.. చలానా సర్వర్ డౌన్

March 1, 2022

bfbdbdg

వాహనాలపై సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల విషయంలో హైదరాబాద్ పోలీసులు భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తారు. ప్రతి నిమిషానికి 700 చొప్పున క్లియరెన్సులు రాగా, గంటల వ్యవధిలోనే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే రద్దీ విపరీతంగా ఉండడంతో క్లియరెన్సుకు సంబంధించిన సర్వర్ పై ఒత్తిడి పెరిగి వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. వాహనాలపై ఉన్న చలాన్ల చెల్లింపులకు మార్చి 1 నుంచి 30 వ తారీఖు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా సర్వర్ సామర్థ్యాన్ని పది రెట్లు పెంచామని పోలీసులు చెప్తున్నారు. అయినా అంచనాలకు మించి వాహపదారులు వెబ్ సైట్ ను తెరవడంతో సర్వర్ కుప్పకూలిందని వారు వాపోతున్నారు.