Telangana EdCET Result 2022 today at 4:30 pm, check TS EdCET result
mictv telugu

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

August 26, 2022

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఎడ్‌సెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అభిషేక్ మహంతికి మొదటి ర్యాంక్ రాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంకు సాధించారు. పరీక్షకు మొత్తం 38,091 మంది దరఖాస్తు చేయగా అందులో 31, 578 హాజరయ్యారు. వీరిలో 30,580 అర్హత సాధించారు.

జులై 26, 27 తేదీల్లో తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీని 30న ప్రకటించారు. ఈ నెల 1 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.