Telangana: Edset exam in three phases
mictv telugu

తెలంగాణ: మూడు విడతల్లో ఎడ్‌సెట్ పరీక్ష

July 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్ధినీ, విద్యార్థులకు అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించడానికి తెలం‌గా‌ణలో 39, ఏపీ‌లోని కర్నూల్‌, విజ‌య‌వా‌డలో పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, రేపు జరగబోయే ఎడ్‌సెట్ పరీక్షను మూడు విడతల్లో నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోని, పరీక్షకు హాజరుకావాలని అన్నారు.

”తెలంగాణలో రేపు ఎడ్‌సెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది విద్యా‌ర్థులు హాజరుకానున్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీ‌క్షను ఒకే‌రోజు మూడు సెష‌న్లలో నిర్వహి‌స్తాం. ఉదయం 9 గంట‌లకు పరీక్ష ప్రారం‌భ‌మ‌వు‌తుంది. నిమిషం ఆల‌స్యమైనా విద్యా‌ర్థు‌లను పరీ‌క్షా ‌కేంద్రా‌ల్లోకి అను‌మ‌తించం. ప్రతి ‌ఒ‌క్కరూ కొవిడ్‌ నిబం‌ధ‌నలు పాటిం‌చా‌లి. విద్యా‌ర్థులు హాల్‌‌ టి‌కె‌ట్లను https:// edcet.tsche.ac. in నుంచి డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వాలి” అని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ రామ‌కృష్ణ తెలి‌పారు.