తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఈనెల 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ పరీక్షలను ప్రారంభించి మార్చి 2నాటికి పూర్తి చేయాలని బోర్డు స్పష్టం చేసింది. కాగా ప్రతిరోజూ రెండు సెషెన్స్ లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించిది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా హాల్ టికెట్లను జారీ చేయాని కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియేట్ ఎడ్యుకేషన్ బోర్డు. కాగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత మార్చి 4న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది.