ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్ పోలీస్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్ పోలీస్ మృతి

March 2, 2018

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురం అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్లో సుశీల్ కుమార్ అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ సుశీల్ చనిపోయారని పోలీసులు తెలిపారు. 2004 బ్యాచ్‌కు చెందిన సుశీల్ స్వస్థలం వికారాబాద్. ఎన్ కౌంటర్లో మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.కాగా, ఎన్‌కౌంటర్లో కేకేడబ్ల్యూ దళం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మావోయిస్టు మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్, ఖమ్మం కార్యదర్శి సాంబయ్య, ఆయన భార్య, దామోదర్ గోపాల్ తదితరులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి వస్తున్నాయి. మృతదేహాలను గుర్తించాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.