Telangana: Every year there are three lakh marriages..mostly in these districts
mictv telugu

తెలంగాణ: ప్రతి ఏటా మూడు లక్షల పెళ్లిళ్లు..ఎక్కువగా ఈ జిల్లాల్లోనే

September 5, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు లక్ష నుంచి మూడు లక్షల పెళ్లిలు జరుగుతున్నాయని స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకు వివాహాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని, గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పెళ్లిళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

”తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విహహాల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వివాహాల రిజిస్ట్రేషన్లో రాష్ట్రంలోనే.. కరీంనగర్ జిల్లా టాప్ ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా కులాలు, మతాల పట్టింపులు లేని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. హిందూ వివాహాలతోపాటు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద హిందూ వివాహ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్, ముస్లిం వివాహాలు కూడా అమలవుతున్నాయి.

గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 4,52,878 సాధారణ వివాహాలు, 15,988 కులాలు, మతాల పట్టింపులు లేని ప్రత్యేక వివాహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాధారణ వివాహాల రిజిస్ట్రేషన్లలో జంట నగరాల కంటే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఉన్నాయి. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కంటే అదిలాబాద్ జిల్లాలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి” అని  వెల్లడించారు.

వివాహాల నమోదు ఎలా చేస్తారు అనే విషయంపై కూడా అధికారులు స్పష్టతనిచ్చారు.”రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద వివాహాలను హిందూ వివాహాల చట్టంతోపాటు ప్రత్యేక కల్యాణం కింద నమోదు చేస్తాం. వధువు, వరుడు ఒకే మతానికి చెందిన వారైతే, వారి ఏడడుగల బంధాన్ని ఒక విధానంలో రిజిస్టర్ చేస్తాం. ప్రేమ పెళ్లిళ్లు, కులాలు, మతాల పట్టింపులే కుండా రిజిస్టర్ చేసుకునే పెళ్లిని స్పెషల్ మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ విధానంలో చేస్తాం. ప్రతి పెళ్లికి ఓ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తాం”.