తెలంగాణ రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి(86) ఇక లేరు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్థరాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో అడ్వాన్స్ క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు.
సెప్టెంబర్ 28న ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన సిటీ న్యూరో కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారం క్రితం పరీక్షలు చేయగా నెగటీవ్ వచ్చింది. త్వరలోనే డిశ్చార్జ్ అవ్వాల్సి ఉన్నా.. న్యుమోనియా కారణంగా అతడికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. నాయినితో పాటు ఆయన భార్య భార్య అహల్య, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కొడుకు కరోనా బారిన పడగా వారంతా కోలుకున్నారు. నాయిని మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.