టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ‘బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాం’ ఇక నుంచి - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ‘బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాం’ ఇక నుంచి

April 25, 2022

టాలీవుడ్‌ని ఊపేసిన డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ వేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాలన్న ఉద్దేశం లేదు. పాలనాపరమైన కారణాల వల్ల ఈడీకి వివరాలివ్వడం కొంత ఆలస్యమైంది. దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాం. కేసు విచారణలో ఈడీకి సహకరిస్తాం. కోర్టు ధిక్కరణ కేసు కొట్టేయ’మని కోరారు. కాగా, నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులను కోర్టు ఆదేశించినా ఇవ్వట్లేదని ఈడీ ఆరోపించింది. దీనిలో భాగంగా కోర్టు ధిక్కరణ కింద సీఎస్, ఎక్సైజ్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఈడీ కోర్టును కోరింది. ఈ విషయంపైనే సోమవారం విచారణ జరిగింంది. ఇంతేకాక, ‘ఇప్పటికే ఈడీకి 828 పేజీల నివేదిక ఇచ్చాం. ఇంతకుముందు కోర్టుకు సమర్పించిన డిజిటల్ రికార్డులను అందించాం. సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను, 12 మంది నిందితుల కాల్ డేటా, విచారణ వీడియో రికార్డింగులను ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు.