Telangana: Exercises for another 547 posts.. Announcement soon
mictv telugu

తెలంగాణ: మరో 547 పోస్టులకు కసరత్తులు..త్వరలోనే ప్రకటన

July 25, 2022

ఇండియా పోస్ట్ ఆఫీస్ గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఓ శుభవార్తను చెప్పారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 547 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారని, ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. అంతేకాదు, గతంలో మంజూరైన పోస్టులకు సంబంధించి భర్తీ కాగా మిగిలిన పోస్టులతోపాటు, తపాలా శాఖలో పదవీ విరమణలు, పదోన్నతులు, రాజీనామాలతో ఖాళీ అయిన పోస్టులను కూడా కలిపి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

”తెలంగాణ తపాలా సర్కిల్ పరిధిలో 547 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నాం. త్వరలోనే నోటిఫికేషన్‌ను ఇస్తాం. ఇందుకోసం తెలంగాణలోని తపాలా శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గతంలో మంజూరైన పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు, ప్రస్తుతం తపాలా శాఖలో పదవీ విరమణలు, పదోన్నతులు, రాజీనామాలతో ఖాళీ అయిన మరికొన్ని పోస్టులు ఉన్నాయి. వాటినిక కూడా కలిపి పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే తెలంగాణ సర్కిల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2,492 పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. గత నవంబరులో 733 పోస్టులను నోటిపై చేయగా, 160 భర్తీ అయ్యాయి. మిగతావాటి భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.” అని ఓ అధికారి తెలిపారు.

ఇప్పటికే తెలంగాణలో పోలీస్ శాఖ, గ్రూప్-1, విద్యుత్ శాఖ, వైద్యశాఖల్లో నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి అధికారులు ఇదివరకే తేదీలను ప్రకటించారు. వచ్చే నెల 7న కానిస్టేబుల్, 21న ఎస్సై పరీక్షలకు జరగనున్నాయి. ఇటువంటి సమయంలో ఖాళీగా 547 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.