తెలంగాణ సినిమాకు రెక్కలొస్తున్నాయ్.. ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సినిమాకు రెక్కలొస్తున్నాయ్.. !

August 29, 2017

‘ అర్జున్ రెడ్డి ’ సినిమాను చూసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఫేస్ బుక్ లో స్పందించారు. అర్జున్ రెడ్డి సినిమా తెలంగాణ సినిమా నిర్మాణానికి ప్రారంభ సూచిక అని అన్నాడు. ‘‘ఈ సినిమా విజయంతో నేను చాలా బలంగా నమ్మేదేమిటంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి నాంది పలికిందని.  అలాగే తెలంగాణ నుంచి మంచి మంచి నటీనటులు, గొప్ప టాలెంటున్న దర్శకులు వస్తున్నారు. ఇదెంతో హర్షించదగ్గ విషయం. అలాగే ఫక్తు తెలుగు సినిమాలకు దీటుగా తెలంగాణ సినిమా రెక్కలు తొడుక్కుంటున్నది. ఇక్కడ మట్టి కథలు రియలిస్టిక్ ఫ్లేవర్ తో వస్తున్నాయి. మేకింగ్ విషయంలో కూడా తెలంగాణ వాళ్ళే కొత్తగా ఆలోచిస్తున్నారు. . ఫ్యూచర్లో కంప్లీట్ గా తెలంగాణా నుండే సరికొత్త కథలు, వినూత్నమైన న్యూ వేవ్ సినిమాలు వస్తాయి‘ అని

వర్మ అన్నాడు. అది ‘ అర్జున్ రెడ్డి ’ తో పక్కా ప్రూవ్ అయిందని చెప్పుకొచ్చాడు

.

నిజమే వర్మ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా తనకు అనిపించింది చెప్పేస్తాడు. తెలంగాణ స్టేట్ ఏర్పడ్డాక తెలంగాణ నుండి కొత్త పరిమళం వికసిస్తోంది. ‘ అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో సాగర్ చంద్ర, ‘ శరణం గచ్ఛామి ’ తో ప్రేమ్ రాజ్, ‘ ఘాజీ ’ తో సంకల్ప్ రెడ్డి, ‘ పెళ్లి చూపులు ’ తో తరుణ్ భాస్కర్, ఇప్పుడు ‘ అర్జున్ రెడ్డి ’ తో సందీప్  రెడ్డి వంగా, రేపు రాబోయే ‘ నీదీ నాదీ ఒకే కథ ’ సినిమాతో వేణు ఊడుగుల, ‘ వాలుజడ ’ సినిమాతో రమణ మల్లం దర్శకులుగా తమ సత్తా చాటుతున్నారు. వర్మ చెప్పినట్టు తెలంగాణ సినిమానే తెలుగు సినిమాకు సరికొత్త నడకను నేర్పుతుంది.