తెలంగాణ ఇంజనీరింగ్ విభాగంలో 1663 పోస్టులకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 45,325 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చి వాటికి నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఇంజనీరింగు విభాగంలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి విభాగాల్లోని పోస్టులకు అనుమతులిచ్చింది. దీంతో మొత్తం ఇప్పటివరకు 46,998 పోస్టులకు అనుమతులిచ్చినట్టయింది. విభాగాల వారీగా చూస్తే..
1. నీటి పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు
2. నీటి పారుదల శాఖలో 227 ఏఈ పోస్టులు
3. నీటి పారుదల శాఖలో 212 జూనియర్ టెక్నికల్ అసిస్టెంటులు
4. నీటి పారుదల శాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
5. భూగర్భ జల శాఖలో 88 పోస్టులు
6. ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు
7. ఆర్ అండ్ బీలో 145 సివిల్ ఏఈఈ పోస్టులు
8. ఆర్ అండ్ బీలో 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు
9. ఆర్ అండ్ బీలో 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
10. ఆర్ అండ్ బీలో 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
11. ఆర్ధిక శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.