తొలి విడతలో 30 వేల పోస్టుల భర్తీ.. అనుమతించిన ఆర్థిక శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

తొలి విడతలో 30 వేల పోస్టుల భర్తీ.. అనుమతించిన ఆర్థిక శాఖ

March 24, 2022

010

తెలంగాణలో 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనకనుగుణంగా ప్రభుత్వ విభాగాలు అందుకు సిద్ధమవుతున్నాయి. తొలి విడతగా 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందులో గ్రూప్ 1 పోస్టులు 503 ఉన్నాయి. అత్యధికంగా పోలీస్ శాఖలో 16,587 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 2662 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మరికొన్ని శాఖలలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఆయా నియామక శాఖలు సిద్ధమవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటికి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.