వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. కేంద్రం నుంచి తగినంత సాయం అందకున్నా సొంత వనరులతో జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో కాలేజీలు ఏర్పాటవగా, వచ్చే ఏడాది 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను స్థాపించనున్నారు.
వీటిలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం అసిఫాబాద్, జనగాం, నిర్మల్ జిల్లాలు ఉన్నాయి. ఈ కాలేజీలకు అవసరమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఇతరత్రా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కాలేజీకి 433 పోస్టుల చొప్పున మొత్తం 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణను ఆరోగ్య రంగంలో మరింత పరిపుష్టం చేసేలా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ అవసరమైన సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు.
Big Boost to #AarogyaTelangana, Under visionary leadership of #CMKCR garu to provide accessible Healthcare for all. TS Govt accorded sanction for creation of 3897 posts in various categories 9 Medical Colleges & attached Govt General Hospitals under Director Medical Education 1/2 pic.twitter.com/7Olsdoc1ae
— Harish Rao Thanneeru (@trsharish) December 1, 2022