కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదంటూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతాల చెల్లింపులో జాప్యం జరగడానికి కారణం కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడమేనని, కేంద్రం ఉద్దేశపూర్వకంగా సతాయిస్తోందని మండిపడ్డాడు. టీచర్లకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘‘దేశంలో టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నది తెలంగాణలోనే. వారి బదిలీలు, పదోన్నతులపై ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. అన్ని సమస్యలను త్వరగానే పరిష్కరిస్తారు. విద్యాశాఖలోని ఖాళీలు కూడా త్వరగానే భర్తీ అవుతాయి. కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ. 5 వేల కోట్లను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.