బాల కార్మికుల కేసుల్లో తెలంగాణ అగ్రస్థానం  - MicTv.in - Telugu News
mictv telugu

బాల కార్మికుల కేసుల్లో తెలంగాణ అగ్రస్థానం 

October 2, 2020

Telangana First in Child Labour Case

దేశంలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించేందుకు ఎంత పక్కాగా చట్టాలు అమలు చేస్తున్నా చాలా మంది ఆ కూపంలో మగ్గిపోతూనే ఉన్నారు. చిన్న వయసులోనే శక్తికి మించిన భారాన్ని మోస్తున్నారు. జాతీయ నేరాల బ్యూరో NCRB తాజాగా బాల కార్మికుల గణాంకాలను విడుదల చేసింది. దీంట్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా బాలకార్మికులకు సంబంధించి 770 కేసులు నమోదు కాగా,  తెలంగాణలో 314 కేసులు ఉన్నాయి.  

ఒక్క హైదరాబాద్‌లోనే 21 మందిని గుర్తించారు. దేశ వ్యాప్తంగా 459 మందికి ఈ కూపం నుంచి విముక్తి కలిగింది. తెలంగాణ తర్వాత కర్ణాటక 83, అస్సాం 68, గుజరాత్ 64 మంది బాల కార్మికులను గుర్తించారు. బాలలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణలో 2,560 నమోదయ్యాయి.  పెళ్లి కోసం యువతులను కిడ్నాప్ చేసిన కేసులు 393. సోషల్ మీడియాలో యువతులను వేధించిన కేసుల్లో మహారాష్ట్ర2,161 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ 1,204 కేసులతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. మోసం కేసుల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 9,233 కేసులు నమోదయ్యాయి.