Telangana: For police candidates..higher officials advice
mictv telugu

తెలంగాణ: పోలీస్ అభ్యర్థులకు..ఉన్నతాధికారులు సూచన

July 8, 2022

police01

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీసు ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు నెలలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన మొదటి ప్రక్రియ అయిన ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రిపేరేషన్‌లో వేగం పెంచారు. ఈసారి ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలన్న తపనతో అభ్యర్థులు రాత్రిపగలు కష్టపడుతున్నారు.

ఈ క్రమంలో ఉన్నతాధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన సూచన చేశారు. గతంలో జరిగిన పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కులుండేవి కావని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి జరగబోయే పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్‌ను పెట్టందన్న విషయాన్ని అభ్యర్థులు మార్చిపోవద్దని గుర్తు చేశారు. దయచేసి అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఊహించి బబ్లింగ్ చేయకూడదని, అలా చేస్తే అభ్యర్థులు పరీక్షలో తప్పేముప్పు ఉందని, నెగిటివ్ మార్కింగ్ పట్ల అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

”గతంలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30శాతం రావాల్సి ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30శాతమే ఆర్హతగా పరిగణించాం. 200 మార్కులున్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలను గుర్తిస్తే చాలు. వాళ్లు శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు. ఓఎంఆర్ షీట్లో ఎలాంటి బబ్లింగ్ చేయకుండా ఉంటే వాటిని సున్నా మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటాం. అలా కాకుండా బబ్లింగ్ చేసిన జవాబు తప్పయితే, నెగెటివ్ మార్కులు వేయనున్నాం. అయిదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగెటివ్ మార్కు పడనుంది. కాబట్టి అభ్యర్థులు ఊహించి సమాధానాలు రాయకపోవడమే ఉత్తమం” అని ఉన్నతాధికారులు సూచించారు.