Telangana Forest ranger issue Bhadradri kottagudem
mictv telugu

భద్రాద్రి జిల్లాలో ఘోరం.. గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి

November 22, 2022

Telangana Forest ranger issue Bhadradri kottagudem

అడవిలో మొక్కల నాట్ల వివాదం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం దగ్గర్లోని ఎర్రబోడులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. అటవీ శాఖ అధికారులు నాటిన ప్లాంటేషన్ మొక్కలను గుత్తికోయలు నరుకుతుండగా శ్రీనివాసరావు అనే ఫారెస్ట్ రేంజర్ అడ్డుకున్నాడు. కోయలు ఆయనపై కత్తులతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును మొదట చండ్రుగొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రబోడులో గుత్తికోయలు సాగు చేసుకుంటున్న భూమిలో అధికారులు మొక్కలు నాటడంతో, తమకు ఆ భూమి దక్కకుండా పోతుందనే భయంతో గుత్తికోయలు ప్రతిఘటనకు దిగినట్లు తెలుస్తోంది.