రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. అమరులకు నివాళ్లు అర్పించిన సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. అమరులకు నివాళ్లు అర్పించిన సీఎం కేసీఆర్

June 2, 2020

Telangana Formation Day

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకులు నిరాడంబరంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలను ఆవిష్కరించి అమరులకు నివాళ్లు అర్పించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా సంబరాలు చేశారు. ఉదయాన్నే సీఎం కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాల మౌనం పాటించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. కాగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆవిర్భావ వేడుకలను నిర్వహించాయి.