తెలంగాణ మాజీ హోమంత్రి, దివంగత టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య అహల్య(68) ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న ఆమె శ్వాసకోశాల ఇన్ఫెక్షన్తో తుదిశ్వాస విడిచారు. వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది.
నాయిని కూడా కరోనా నుంచి కోలుకుని నిమోనియాతో గత బుధవారం కన్నుమూయడం తెలిసిందే. ఆయన కడచూపు కోసం అహల్య వీల్ చెయిర్లో వచ్చాయి. నాయిని, అహల్య దంపతులకు దేవేందర్ రెడ్డి, సమంత రెడ్డి సంతానం. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. కూతురు సమంత న్యాయవాద వృత్తిలో ఉన్నారు.