టీం ఇండియా -u19 జట్టులో తెలంగాణ అమ్మాయి - MicTv.in - Telugu News
mictv telugu

టీం ఇండియా -u19 జట్టులో తెలంగాణ అమ్మాయి

November 20, 2022

తెలంగాణ అమ్మాయి టీమిండియా తలుపు తట్టింది. గత కొంతకాలంగా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న గొంగడి త్రిష టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు కూడా చోటు కల్పించారు.

భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష బ్యాట్, బంతి తోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాది. ఆమె గతంలో 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. అంతేకాదు, త్రిష 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది. బీసీసీఐ నిర్వహించినా అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.