Telangana: Good news for part-time staff..Huge increase in wages
mictv telugu

తెలంగాణ: పార్ట్ టైం సిబ్బందికి గుడ్‌న్యూస్..వేతనాలు భారీగా పెంపు

August 5, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఉన్న గురుకులాల్లో పార్ట్ టైం సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న వారికి కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. గురుకులాల పార్ట్ టైం సిబ్బంది వేతనాలను భారీగా పెంచుతూ, గురువారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి డి. రొనాల్డ్స్ మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు భారీగా పెరిగాయి. పెంచిన వేతనం జులై 2022 నుంచి వర్తిస్తుంది. డిగ్రీ లెక్చరర్లకు రూ. 30,000 నుంచి రూ. 32,500కు, జూనియర్ లెక్చరర్లకు రూ. 18,000 నుంచి రూ. 29,400కు, పీజీటీ/టీజీటీలకు రూ. 14,000 నుంచి రూ. 18,200కు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు , పీఈటీలు, స్టాఫ్ నర్సులకు రూ. 10,900 నుంచి రూ. 14,170 పెరిగాయి” అని ఆయన అన్నారు.

అనంతరం ఆసోషియేషన్ అధ్యక్షులు సి. హెచ్. బాలరాజు మాట్లాడుతూ..”సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలకు 85మంది వీఆర్వోలను కేటాయించారు. ఇప్పటికే గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కొనసాగించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.