తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు హైకోర్ట్ రిజిస్ట్రార్ గుడ్‌న్యూస్ చెప్పారు. తెలంగాణ హైకోర్ట్‌లో ఖాళీగా ఉన్న 85 ఉద్యోగాలకు మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశామని పేర్కొన్నారు. విడుదల చేసిన 85 పోస్టుల్లో 43 టైపిస్ట్ పోస్టులు, 42 కాపీయిస్ట్ పోస్టులు ఉన్నాయని ఆయన వివరాలను వెల్లడించారు.
అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ..” తెలంగాణ హైకోర్టులో 43 టైపిస్ట్ పోస్టులు, 42 కాపీయిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు అర్హతలు ఏమిటీ? ఎంత వయసు ఉండాలి? పరీక్ష విధానం ఎలా ఉంటుంది? ఫీజు ఎంత? దరఖాస్తుల చివరి తేదీ ఎప్పుడు? అనే పూర్తి వివరాలను నోటిఫికేషన్లో ప్రస్తావించాం. పూర్తి వివరాల కోసం నిరుద్యోగులు అధికారిక వెబ్సైట్ tshc.nic.inలో చూడండి” అని ఆయన అన్నారు.
”మొత్తం 85 పోస్టులు.. అందులో 43 టైపిస్ట్, 42 కాపీరైటర్. ఈ పోస్టులకు ఆగస్టు 10 నుంచి 25లోగా దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. సెప్టెంబరు 5న హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. సెప్టెంబరు 25న రాత పరీక్ష ఉంటుంది. 18 నుంచి 34 ఏళ్ల వయసుండి, డిగ్రీతోపాటు టైప్ రైటింగ్‌లో హయ్యర్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.”