Telangana: Good news.. Jive release for replacement of guest lecturers
mictv telugu

తెలంగాణ: గుడ్‌న్యూస్..గెస్ట్ లెక్చరర్ల భర్తీకి జీవో విడుదల

July 22, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గురువారం ఓ జీవో విడుదల చేసింది. ఆ జీవోలో.. గెస్ట్ లెక్చరర్‌గా నియామాకం కావాలంటే, ఏ అర్హతలు ఉండాలి? ఎంత శాతం మార్కులు రావాలి? ఎవరు అర్హులు? అనే పూర్తి వివరాలను అధికారులు స్పష్టంగా తెలియజేశారు.

అధికారులు విడుదల చేసిన జీవోలో..”తెలంగాణలోని ఆయా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న గెస్ట్ లెక్చర్లర నియామానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2022-23 విద్యాసంవత్సరానికి అన్నీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల భర్తీకి ఉత్తర్వులు విడుదల చేసింది. అభ్యర్థులకు.. ఈ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే పీజీలో కనీసం 55 శాతం, ఎస్టీ, ఎస్టీ వారైతే 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఆ తర్వాత నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎన్నికైన ప్రతి లెక్చరర్.. రోజుకు 4 గంటలు, నెలకు 72 గంటల పాటు పనిచేయాలి. ఈ నియామాకలను గెస్ట్ లెక్చరర్ల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆయా ప్రభుత్వ కాలేజీలు విడుదల చేస్తాయి” అని పేర్కొన్నారు.