మెడికల్ స్టూడెంట్స్కు స్టైఫండ్ పెంచిన సర్కార్
మెడికల్ స్టూడెంట్స్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్టైఫండ్ను 15శాతం పెంచుతూ నిర్ణయిం తీసుకుంది. దీంతో వైద్య కళాశాలల్లో చదివే ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లోమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్టైపెండ్ పెరగనుంది. పెంచిన స్టైఫండ్ను జనవరి 1, 2023 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతామని గతంలోనే నిర్ణయం తీసుకోగా.. తాజాగా వీటిని అమలు చేశారు. డెంటల్ హౌస్ సర్జన్లు, మెడికల్ విద్యార్థులకు రూ.22 వేల నుంచి రూ.25,906 లకు స్టైఫండ్ పెరిగింది. ఇక పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.50,385 నంచి రూ.58,289 లకుపెరిగింది. సెకండియర్ విద్యార్థులకు 53,503 నుంచి 61,528 పెరగ్గా.. థర్డ్ ఇయర్ విద్యార్థులకు 56,319 నుంచి 64,767కి స్టైఫండ్ పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్య విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.