ట్రెక్కింగ్, ఆటపాటలు, జీన్స్‌తో, గుడిలో వెళ్లడం, బంగ్లాలో దెయ్యం ముచ్చట.. తదితర విశేషాలు, వివాదాలతో సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న ఐఏఎస్ కాటా ఆమ్రపాలి ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కీలక పదవిలో ఉన్న నేపథ్యంలో ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 1210 గజాల స్థలాన్ని కేటాయించింది. వారి కుటుంబానికి ఇప్పటికే ఉన్న స్థలానికి దారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
వికారాబాద్ జిల్లా కొత్రేపల్లిలో ఆమ్రపాలి తల్లి పద్మావతికి 4.27 ఎకరాల స్థలం ఉంది. అయితే దీనికి అప్రోచ్ రోడ్డు లేదు. దీంతో రాకపోకల కోసం తగినంత స్థలం కేటాయించాలని ఆమ్రపాలి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సర్కారు సానుకూలంగా స్పందిస్తూ.. రూ.4 లక్షలకు 1210 గజాల స్థలాన్ని అప్పగించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.