ఎండాకాలం వచ్చేసింది. తెలంగాణలోని పాఠశాలలు వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఈ మేకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ. అదేవిధంగా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షల్లో మార్పులు చేశారు. సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీలను మారుస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీ నుంచి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు జరగాల్సింది. వాటిని ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. పదవ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నం సంగతి తెలిసిందే.
కాగా 1వ తరగతి నుంచి 5 వతరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి 17తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక ఒంటిగంట బడులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 24వ తేదీని పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించి ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తిరిగి జూన్ 12న పాఠశాలలను తెరుస్తున్నట్లు వెల్లడించారు. 48రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.