1500 పడకల 'కరోనా హాస్పిటల్' సిద్ధం..మంత్రి ఈటల - MicTv.in - Telugu News
mictv telugu

1500 పడకల ‘కరోనా హాస్పిటల్’ సిద్ధం..మంత్రి ఈటల

April 7, 2020

Telangana government arranged 1500 beds hospital to treat coronavirus patients

కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి చైనా ప్రభుత్వం వారం రోజుల్లో వెయ్యి పడుకల ఆసుపత్రిని ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. కాగా, క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, గచ్చిబౌలిలో 1500 పడకల కరోనా ఆసుపత్రిని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్, ఈటల, వైద్యాధికారులు కలసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, మరో 22 మెడికల్ కాలేజీల ఆసుపత్రులను కూడా కరోనా హాస్పిటల్స్ గా మార్చామని తెలిపారు. ‘కరోనా’ కట్టడికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.