Telangana government cancelled holiday on nov 12 second saturday for schools and colleges
mictv telugu

రెండో శనివారం.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు రద్దు

November 11, 2022

ఈ నెల 12వ తేదీన అంటే రేపు రెండో శనివారం సందర్భంగా ఉండే సాధారణ సెలవును తెలంగాణ ప్రభుత్వం సెలవును రద్దు చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సెలవు రాష్ట్రం మొత్తం కాదు. కేవలం హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక రాష్ట్రంలోని పాఠశాలలకు మిగతా సెలవులను పరిశీలిస్తే.. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి. జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు కొనసాగనున్నాయి.