తెలంగాణలోనూ జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ఆంక్షలు ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలోనూ జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. ఆంక్షలు ఇలా

May 31, 2020

extended lockdown.

తెలంగాణ రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్ 4.0ను పొడిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ దానిని పొడిగించేందుకు నిర్ణయించారు. లాక్‌డౌన్ 5.0ను జూన్ 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో కూడా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎస్, డీజీపీ, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై రాష్ట్రంలో కట్టడి ప్రాంతాలకే లాక్‌డౌన్‌ వర్తిస్తుందని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. మరోవైపు అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రజారవాణా మీద ఎలాంటి నిబంధనలను పేర్కొనలేదు. కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ 4 గైడ్ లైన్స్‌లో ఇతర రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని అనుమతులు తీసుకుని బస్సులు నడపవచ్చు అని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక కేంద్రం చెప్పినట్టు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగుతాయి. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత దుకాణాలు తెరవడానికి వీల్లేదు. కేవలం ఆసుపత్రులు, ఫార్మసీలు మాత్రమే తెరిచి ఉంచవచ్చు.