తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించగా, ఆ తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. కేసును సీబీఐకి ఇస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని, పిటిషన్‌ని వెంటనే విచారించాలని న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. స్పందించిన సీజేఐ చంద్రచూడ్.. పిటిషన్‌ని వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని తెలిపారు. బుధవారం మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం తప్పకుండా పిటిషన్ విచారణకు వస్తుందని స్పష్టం చేశారు.