Telangana Government finalized engineering college fee
mictv telugu

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరార్.. ఏకంగా..

October 19, 2022

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 150 కాలేజీల్లో ఫీజులు వెల్లడించింది. 40 కాలేజీల్లో ఈ మొత్తం లక్ష రూపాయలు దాటడం గమనార్హం. అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) చేసిన సిఫార్సుల ప్రకారం ఫీజులను సవరించారు. పెంపు మూడేళ్లపాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఎంజీఐటీలో ఫీజు రూ. 1.60 లక్షలు, సీవీఆర్‌లో రూ.1.50 లక్షలు, వర్ధమాన్, వాసవి, సీబీఐటీల్లో రూ. 1.40 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంటు వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నెల 21 నుంచి తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరగనుంది.