తెలంగాణలో కూరగాయల ధరలు ఫిక్స్..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కూరగాయల ధరలు ఫిక్స్.. 

March 26, 2020

Telangana government fixes vegetable and grains pulses prices 

కరోనా సందట్లో స్వార్థ వ్యాపారులు నిత్యావసరాల ధరలను భారీగా పెంచేశారు. పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెడతామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ హెచ్చరించినా ధరలు దిగిరావడం లేదు. దీంతో పేదప్రజలు చెమడోట్చి సంపాదించిన డబ్బులను కాస్తా కరోనా వైరస్‌పై పేలాలు ఏరుకుంటున్న వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ధరలు తగ్గకపోతే లాక్‌డౌన్ కాస్తా అపహాస్యం పాలయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 

రాష్ట్రంలో కూరగాయలను ఎంతకు అమ్మాలో ఖరారు చేసింది. అంతకు మించి అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతారు.  లైసెన్సులు కూడా రద్దవుతాయి… తస్మాత్ జాగ్రత్త.. 

కూరగాయల ధరలు కేజీ.. 

టమాటాలు రూ. 10 

వంకాయలు రూ. 30 

తెల్ల ఉల్లిపాయలు రూ.30 

ఎర్ర ఉల్లిపాయలు  రూ.35 

వెల్లుల్లి రూ.160 

అల్లం రూ. 220

పచ్చిమిర్చి రూ.60 

బెండకాయలు రూ.40 

టమాట రూ.10 

అరటికాయ రూ.40 

కాలిఫ్లవర్‌ రూ.40 

చిక్కుడుకాయ రూ.45 

బీరకాయ రూ.60 

క్యారెట్‌ రూ.60 

ఆలుగడ్డ రూ.30 

క్యాబేజి రూ.23 

 

ఆకు కూరలు కేజీకి 

పాలకూర- రూ.40

తోటకూర రూ.40

కొత్తిమీర  రూ.60

మెంతికూర రూ.60

 

పప్పులు, ధాన్యాలు కేజీకి 

గ్రేడ్1 కందిపప్పు రూ.95

మినప్పప్పు రూ.140

గోధుమలు రూ.36

పెసరపప్పు రూ.105

శెనగపప్పు రూ.65

జొన్నలు రూ.38

రాగులు రూ.40

సజ్జలు రూ.30