నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-4 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-4 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

November 25, 2022

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే TSPSC ద్వారా మొత్తం 9వేల168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.

జూనియర్ అకౌంటెంట్ :429
ఆర్థికశాఖ- 191, మున్సిపల్ శాఖ 238

జూనియర్ అసిస్టెంట్ :6859
రెవెన్యూ- 2077, పంచాయతీ రాజ్-1245
మున్సిపల్-601,బీసీ వెల్ఫేర్ -307, ఆరోగ్య- 338
ఉన్నత విద్య-742, హోం-133, ట్రైబల్ వెల్ఫేర్-221
సెకండరీ ఎడ్యూకేషన్-97, ఎస్సీ డెవెలప్‌మెంట్-474

జూనియర్ ఆడిటర్-18
వార్డ్ ఆఫీసర్ -1862