Telangana government has given permission to fill up 2,440 more jobs
mictv telugu

శుభవార్త.. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ఓకే

July 22, 2022

Telangana government has given permission to fill up 2,440 more jobs

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్‌ అండ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్లలో 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 మంది జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇంటర్‌ విద్యలో 40 లైబ్రరీయన్‌, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, ఆర్కైవ్స్‌ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 247 లెక్చరర్లు, 14 ఇన్‌స్ట్రక్టర్లు, 31 లైబ్రరీయన్లు, 5 మాట్రన్‌, 25 ఎలక్ట్రిషీయన్లు, 37 పీడీ పోస్టులు, కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్‌ పోస్టులు, 24 లైబ్రరీయన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.