Telangana Government has issued orders to celebrate Kaloji Narayana Rao birth anniversary
mictv telugu

రాష్ట్ర పండుగ‌గా కాళోజీ జ‌యంతి.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

September 5, 2022

ప్ర‌జా క‌వి కాళోజీ నారాయ‌ణ‌రావు జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 9న కాళోజీ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌భుత్వ శాఖ‌లు, విద్యాసంస్థ‌లు, స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ కాళేజీ జ‌యంతి జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.