ప్రభుత్వ టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్.. ఆస్తుల వివరాలపై కీలక నిర్ణయం! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్.. ఆస్తుల వివరాలపై కీలక నిర్ణయం!

June 25, 2022

ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాకింగ్ విషయం చెప్పింది. ఇక నుంచి వారు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతీ ఏడాదీ ఆస్తుల వివరాలను ఇవ్వాలని పేర్కొంది. అంతేకాక, టీచర్లు స్థిర, చర భూములు కొన్నా, అమ్మినా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం కారణంగా రాష్ట్రస్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.